మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బాలాజీ అపార్ట్ మెంట్ లో ఆదివారం కనకదుర్గ కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీశ్రీశ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు.
ఉత్సవాల వివరాలు
దుర్గా శరణ్య నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ వరకు భక్తి శ్రద్ధలతో రంగరంగ వైభవంగా జరుగుతాయని ఫణి కుమారచార్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో కమిటీ సభ్యులు మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్), గీతా దంపతులు, గుండా శ్రీనివాసు, అరుణ దంపతులు, పురుషోత్తం, శ్రీలత, జెయినీ వెంకటేశ్వర్లు, గీత, రంగా వెంకటేశ్వర్లు, పద్మ, బురుగు అనంతరాములు, శ్రీనివాసు, రాధ, యల్లయ్య, మారం వెంకటేశ్వర్లు దంపతులు, ప్రభాకర్, కుమారి దంపతులు, తదితర భక్తులు పాల్గొన్నారు.










