మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురంలో మెట్రో లీడర్స్ (చెప్పుల గోదాం) లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చేందుకుఅగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో కలిసి చర్యలు తీసుకున్నారు.మంటలను త్వరగా అదుపు చేసేందుకుమిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ట్యాంకర్లను తెప్పించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గోదాంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు, మున్సిపల్ సిబ్బంది సేవలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందించారు. బాధితులకు జరిగిన ఆస్తినష్టంపై సంబంధిత అధికారులు వివరాలు సేకరించి, తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. డిసిసి ప్రధాన కార్యదర్శి చెరుకూరి బాలు, స్థానిక 47 వ వార్డు కౌన్సిలర్ ఫారూఖ్ మొహమ్మద్, స్థానిక యువకులు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మెట్రో టేడర్స్ చెప్పుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..
Share:

సారాంశం
స్వయంగా రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
ముఖ్య విషయాలు
- మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురంలో మెట్రో లీడర్స్ (చెప్పుల గోదాం) లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
- విషయం తెలిసిన వెంటనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
- ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చేందుకుఅగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో కలిసి చర్యలు తీసుకున్నారు.మంటలను త్వరగా అదుపు చేసేందుకుమిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ట్యాంకర్లను తెప్పించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
- గోదాంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు, మున్సిపల్ సిబ్బంది సేవలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4415ఆర్టికల్స్
5,32,145వ్యూస్










