మండల కేంద్రమైన ముధోల్ గ్రామాల్లో దుర్గాదేవి మాత ఆగమన వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అమ్మవారిని గ్రామాలకు ఆహ్వానించి, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఒక కొత్త సంప్రదాయంగా మారుతోంది. పలు యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాలను గ్రామాలకు తీసుకెళ్లి ఘనంగా ఆగమన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, ఉప సర్పంచ్ కోరి లావణ్య సాయినాథ్ అమ్మవారి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ వేడుకల్లో యువత, మహిళలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్గాదేవి ఆగమన వేడుకలు గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతోపాటు ప్రజల్లో ఐక్యతను చాటుతున్నాయి. సంప్రదాయాలు, భక్తిభావాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ముధోల్ లో దుర్గాదేవి ఆగమన వేడుకలు:
Share:

సారాంశం
కొత్త సంప్రదాయంతో ఆధ్యాత్మిక సందడి
ముఖ్య విషయాలు
- మండల కేంద్రమైన ముధోల్ గ్రామాల్లో దుర్గాదేవి మాత ఆగమన వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
- అమ్మవారిని గ్రామాలకు ఆహ్వానించి, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఒక కొత్త సంప్రదాయంగా మారుతోంది.
- పలు యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాలను గ్రామాలకు తీసుకెళ్లి ఘనంగా ఆగమన వేడుకలు నిర్వహించారు.
- ఈ సందర్భంగా ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, ఉప సర్పంచ్ కోరి లావణ్య సాయినాథ్ అమ్మవారి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,26,711వ్యూస్








