మహాలయ అమావాస్య సందర్భంగా, పితృదేవతలను స్మరించుకుంటూ మండలం ధర్మోర గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్, ఫుడ్ బ్యాంక్ భైంసా చైర్మన్ ఎం. ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 110 మందికి భోజనం అందించారు.
నిర్మల్ జిల్లా మండలం ధర్మోర గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్, ఫుడ్ బ్యాంక్ భైంసా చైర్మన్ ఎం. ఆంజనేయులు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పితృదేవతలను స్మరించుకుంటూ వారి ఆశీస్సులు పొందాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి జి. కృష్ణమూర్తి సహకరించారు. ఈ సందర్భంగా సుమారు 110 మంది నిరుపేదలకు భోజనం అందించి వారి ఆకలి తీర్చారు. పుణ్యదినాల సందర్భంగా ఆడంబరాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని ఈ కార్యక్రమం నిరూపించింది. ఆర్థికంగా వెనుకబడినవారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సమాజంలో దయ, కరుణ, మానవతా విలువలను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. మహాలయ అమావాస్య సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం సేవాభావానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.


