తిరువూరు నియోజకవర్గ అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడిగా వల్లెపు జగదీష్ భరద్వాజ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని సంఘం జాతీయ అధ్యక్షుడు న్యాయవాది వాండ్రాసి పెంచలయ్య వెల్లడించారు.
ఈ సందర్భంగా జగదీష్ భరద్వాజ మాట్లాడుతూ, అఖిల భారత అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంఘం బలోపేతానికి పాటుపడటంతో పాటు భక్తుల సంక్షేమం కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.
తనపై నమ్మకంతో నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం జాతీయ అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.










