నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లి హెచ్ గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న కర్ర దుర్గామాత ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను గ్రామస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కర్ర దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.










