నగరిలో నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఓం శక్తి ఆలయం, శ్రీ దేశమ్మ దేవస్థానం, శ్రీ సామలమ్మ తల్లి దేవాలయం సహా మూడు ప్రధాన ఆలయాల్లో ఈ వేడుకలు 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
నగరి ఓం శక్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు అమ్మవారిని 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాయి. ప్రతి సంవత్సరం నవరాత్రులలో భాగంగా ఈ ఆలయంలో 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ నిర్వాహకుల్లో ఒకరైన జ్యోతి నాయుడు ఆదివారం నగరి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్‌ను ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నట్లు సమాచారం. నగరి శ్రీ దేశమ్మ దేవస్థానంలో కూడా ఆదివారం నుంచి 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని పాలకమండలి సభ్యులలో ఒకరైన మదన్ కుమార్ మొడలియార్ తెలిపారు. ఈ దేవస్థానంలో కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించనున్నారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని మోర్ కింద పల్లి గ్రామ శివారులలో వెలసి ఉన్న శ్రీ సామలమ్మ తల్లి దేవాలయంలో కూడా ఆదివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు రాజీవ్ నగర్ మనీ, సోము తెలిపారు. ఈ ఆలయం ప్రకృతి సోయగాలతో ఆహ్లాదకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. గత పౌర్ణమి పూజకు నగరి నియోజకవర్గ బలిజ సంఘం అధ్యక్షుడు ఎం.వి. బాబు నిర్వాహకుల ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయం గురించి ఆయన మాటల్లోనే చెబుతూ, ఈ అమ్మవారి మహిమ ఎంతో గొప్పది. ఆలయంలో కాసేపు ఇంకా ఉండాలని నాకు అనిపించింది. ఆలయం వద్ద చల్లటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది అని ఎం.వి. బాబు కొనియాడారు. తరువాత రాజీవ్ నగర్ మనీ, టైలర్ సోము మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాలకు చాలామంది దాతలను సంప్రదిస్తున్నాము. దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి అమ్మవారి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు తోడ్పడాలి అని వారు కోరారు. దాతల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు.










