సమాచార హక్కు వారోత్సవాల్లో భాగంగా, పారదర్శకత, జవాబుదారితనంతో సమాచార హక్కు చట్టాన్ని విజయవంతంగా అమలుపరిచినందుకు గాను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ముఖ్య కార్యనిర్వహణాధికారి దివ్య దేవరాజన్ ఐఏఎస్ కు బెస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవార్డు లభించింది. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రాజధానిలోని రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో, దివ్య దేవరాజన్ ఐఏఎస్ అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని కూడా అందుకున్నారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష ప్రధాన కార్యదర్శి జూజె జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్, ప్రధాన సమాచార హక్కు కమిషనర్ మహేష్ దత్ ఎక్కా ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ సమాచార రిటైర్ కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్, సమాచార హక్కు కమిషనర్ సివి శ్రీనివాసులు, దేశాల భూపాల్, మౌసిన్ ప్రవీణ, వైశాలి, ఎల్లోజి, పలువురు ఐఏఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న డైరెక్టర్లు, పీఎంలు, కార్యాలయ ఉద్యోగులు, ఎఫ్టీఏ ఉద్యోగులు, అడిషనల్ డిఆర్డిఓలు, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, సీబీవోలు, డిఆర్డిఏ, మండల సమాఖ్య, జిల్లా సెర్ప్ కార్యాలయంలో పనిచేసే అడ్మిన్ అసిస్టెంట్లు, డీఈఓలు, ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర ఉద్యోగులు, మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల , సమస్త సెర్ప్ ఉద్యోగులు అవార్డు అందుకున్న సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఐఏఎస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, ఏపీడీ గోవిందరావు, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు, జిల్లా సమాఖ్య కార్యనిర్వహక , మండల సమాఖ్య, గ్రామ సంఘాల , జిల్లా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, సమస్త సెర్ప్ ఉద్యోగులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


