ప్రొద్దుటూరులో అనారోగ్యంతో మరణించిన రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియలను బంధువులు పట్టించుకోలేదు. దీంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, దస్తగిరి, కమల్ భాష, సతీష్, గౌస్ చేయూత అందించారు. వీరంతా కలిసి అంత్యక్రియలను పూర్తి చేశారు.
చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఆసరా లేని వారికి కూడా గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము: 82972 53484, 9182244150.

