ముధోల్ నియోజకవర్గంలో విద్యా రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించేందుకు అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం భైంసాలోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఉత్తమ ఉపాధ్యాయ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యులు, ట్రస్ట్ చైర్మన్ పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు మరియు ల నుండి ఉత్తమ ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులకు ఆహ్వానం
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పవార్ రామారావు పటేల్ కోరారు. ఈ సన్మాన కార్యక్రమం రేపు సాయంత్రం 5:00 గంటలకు జిన్నింగ్ ఫ్యాక్టరీలో జరగనుంది.

