మండలం కౌట్ల బి గ్రామంలోని హనుమాన్ ఆలయానికి టైమర్ సమయ సూచికతో కూడిన ధ్వని వ్యవస్థను దాతగా అందించిన రేగుంట వెంకన్నను, హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం అనంతరం భక్తులు ఘనంగా సన్మానించారు.
హనుమాన్ చాలీసా నిత్య పారాయణంలో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. అనంతరం ఆలయానికి టైమర్ ధ్వని వ్యవస్థను అందించిన రేగుంట వెంకన్నను, హనుమాన్ చాలీసా నిర్వాహకులు, భక్తులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయంలో ప్రతి గంటకు సమయ సూచిక వినిపించేలా ధ్వని వ్యవస్థను అందించడం ద్వారా వెంకన్న చేసిన సేవ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఆయన చేసిన సహాయం ప్రతి గంటకు గుర్తుకు వస్తుందని భక్తులు పేర్కొన్నారు. ఆలయానికి అవసరమైన సదుపాయాన్ని దాతగా అందించినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులు జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ భక్తిభావంతో నినాదాలు చేశారు.










