బాసర లో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఈవో, పూజారులు భైంసా పట్టణంలోని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా, శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు అందజేసి, ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
అనంతరం, ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకున్నారు.












