సిర్పూర్ మండలం డోర్పల్లి గ్రామంలో పత్తి చేనులో కలుపుతీస్తున్న మహిళపై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సిర్పూర్ మండలం డోర్పల్లి గ్రామ సమీపంలోని పత్తి చేనులో డోంగ్రి లక్ష్మీబాయి అనే మహిళ కలుపుతీత పని చేస్తుండగా అడవి పంది ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో లక్ష్మీబాయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అటవీశాఖ అధికారుల స్పందన
ఘటనా స్థలాన్ని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అతారుద్దీన్, ఎఫ్బివో భూమేశ్వర్ లు సందర్శించి, బాధితురాలికి వైద్య సహాయం అందేలా చూశారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ స్పందిస్తూ, పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. బాధితురాలికి అటవీశాఖ తరపున వీలైనంత త్వరగా నష్టపరిహారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.












