సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై ఇటీవల పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నిరాధార, వాస్తవాలకు విరుద్ధమైన కథనాలను ఖండిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు తెలిపారు. అలాంటి నాయకుడిపై ఊహాగానాలు, నిర్ధారణ లేని అంశాల ఆధారంగా కథనాలు ప్రచురించడం సరైన జర్నలిజం పద్ధతి కాదని ఆయన అన్నారు.
పొదెం వీరయ్య సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారని ఇర్ప శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ములుగు నియోజకవర్గం నుంచి రెండుసార్లు, భద్రాచలం నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఇర్ప శ్రీనివాసరావు తెలిపారు.
20182023 మధ్య పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచారని ఇర్ప శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అలాంటి నాయకుడిపై ఊహాగానాలు, నిర్ధారణ లేని అంశాల ఆధారంగా కథనాలు ప్రచురించడం సరైన జర్నలిజం పద్ధతి కాదని ఇర్ప శ్రీనివాసరావు అన్నారు.
వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పనిచేయడానికే పొదెం వీరయ్య ప్రాధాన్యత ఇస్తున్నారని ఇర్ప శ్రీనివాసరావు తెలిపారు.
వాస్తవాలను పరిశీలించకుండా వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించవద్దని, నిరాధార ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఇర్ప శ్రీనివాసరావు కోరారు.












