ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డోంట్ మిస్ ఏ బీట్ అనే ఇతివృత్తంతో ప్రచారం కొనసాగుతోంది. అయితే, గుండె జబ్బులు కేవలం వృద్ధులకే పరిమితం కాకుండా యువతలోనూ అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ హృదయ సమాఖ్య (డబ్ల్యూహెచ్ఎఫ్) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ () సహకారంతో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధుల (సివిడి) పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 2026 సంవత్సరానికి గాను, ఈ ప్రచారం డోంట్ మిస్ ఏ బీట్ అనే ప్రధాన ఇతివృత్తంతో కొనసాగుతోంది. తెలంగాణలోని ఈఎంఆర్ఐ జిహెచ్ఎస్ 108 అత్యవసర సేవలు గుండె సంబంధిత రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్లో 247 ఉచిత అత్యవసర సేవలను అందిస్తూ, రోగులకు తక్షణ ప్రీ-హాస్పిటల్ సంరక్షణను అందించి, వీలైనంత త్వరగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
మొత్తం స్పందించిన 8,08,755 కేసులలో 3 (22,699) కేసులు కేవలం గుండె సంబంధిత సమస్యల వల్లనే నమోదయ్యాయి. ఛాతీ నొప్పికి సంబంధించిన కేసులు నెలకు సగటున 1,892 చొప్పున నమోదు కాగా, అంటే రోజుకు సగటున 62 కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు గుండె సంబంధిత సమస్యలు కేవలం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండె జబ్బుల బారిన పడుతుండటం గమనార్హం. నమోదైన కేసులలో దాదాపు 60 శాతం (13,508) కేసులు 31 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలోనే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
అత్యవసర పరిస్థితిలో 108కి కాల్ చేయడం మర్చిపోవద్దు.












