లోకేశ్వరం కేంద్రంలోని రైతు వేదికలో వికసిత్ గ్రామ్ పంచాయతీ ప్రణాళిక, వికసిత్ భారత్ రోజ్ గార్ అండ్ ఆ జీవిక మిషిన్ ( గ్రామీణ్ ) చట్టం, 2025 పై మండల స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సామర్ధ్య పెంపుదల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రామకృష్ణ మాట్లాడుతూ, వికసిత్ గ్రామ్ పంచాయతీ ప్రణాళిక తయారీలోనూ, దాని సమర్థవంతమైన అమలులోను వివిధ శాఖల సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి పథకం ప్రజలకు సక్రమంగా అందేలా భాగస్వామ్య పద్ధతిలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎంపీవో సల్మాన్ రాజ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కదం భుజంగరావు, వివిధ సర్పంచులు, ఇన్చార్జి ఏపీవో అనిల్, ఏపీఎం భోజన్న, వెటర్నరీ డాక్టర్ షాద్ నవాజ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి వర్ధన్, పంచాయతీ సెక్రెటరీలు, టెక్నికల్ అసిస్టెంట్లు (టిఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకెపి సీసీలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.











