తెలంగాణ ప్రభుత్వం వ్యాస రచనలకు రాష్ట్ర స్థాయి అవార్డులిచ్చే జ్యూరీ సభ్యులుగా మిర్యాలగూడ వాసి వాకిటి మధును ప్రభుత్వంనియమించింది.బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ పేరిట యువతను ప్రోత్సహిస్తు మంచి షార్ట్ ఫిల్మ్స్, పాటలు, జానపధ గేయాలు, తక్కువ నిడివి గల రచనా వ్యాసాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో ఉత్తమంగా ఎన్నుకున్న వాటికి అవార్డులనుఅందజేస్తారు.ఇందులో రచనల విభాగానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని జ్యూరీ చైర్మన్ గా
పొన్నం రవిచంద్ర , అయినంపూడి శ్రీలక్ష్మి, వాకిటి మధు లను జ్యూరీ సభ్యులుగా ప్రభుత్వంనియమించింది. ఆయన నియామకం పట్ల నల్గొండ జిల్లా సీనియర్ జర్నలిస్టులు ఖాజా హామీదుద్దీన్, రంగా శ్రీనివాస్, ఎండి. అస్లాం,పుప్పాల యాదగిరిలు హర్షం ప్రకటించారు.












