మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు
ఈ సందర్భంగా మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు అసల సదాశివ్ మాట్లాడుతూ, కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహానీయులు అని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
ఆసుపత్రికి పేరు మార్చాలని విజ్ఞప్తి
మండల ప్రభుత్వ ఆసుపత్రికి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంతోష్, నరసయ్య, శంకర్, రాజేశ్వర్, నారాయణ, భూమేష్, రమేష్, రవి, సంజీవ్, నవీన్, సాయికుమార్ పాల్గొన్నారు.

