మండలంలోని ఎల్వి, ఝరి-బి గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఈ కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












