నిర్మల్ జిల్లా మండలం ఝరి (బి) గ్రామంలో 70వ ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్థులు బౌద్ధ సంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులందరూ ఏకమై బుద్ధుని బాటలో నడవాలని సంకల్పించారు.
భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారు 1914న మహారాష్ట్రలోని నాగపూర్లోని దీక్షాభూమిలో లక్షలాది మంది అనుచరులతో కలిసి హిందూ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని స్వీకరించిన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. కులరహిత సమసమాజ స్థాపనే లక్ష్యంగా బాబాసాహెబ్ చేపట్టిన ఈ ధర్మచక్ర పరివర్తనం భారతదేశ చరిత్రలోనే ఒక నూతన విప్లవానికి నాంది పలికిందని తెలిపారు. అంబేడ్కర్ చూపిన శాంతి, కరుణ, సమానత్వ మార్గమే బౌద్ధ ధర్మమని, అది మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామంలోని గౌతమ బుద్ధుడు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు కమిటీ అధ్యక్షులు గాదెవార్ విలాస్, ఉపాధ్యక్షులు బంసోడే గౌతం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ వేడుకల్లో అధ్యక్షులు గాదెవార్ విలాస్ మాట్లాడుతూ, నాగపూర్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏ ఉద్దేశంతో అయితే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారో, ఆ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి. గౌతమ బుద్ధుని బోధనలు సమాజంలో అశాంతిని తొలగించి, మనుషుల మధ్య ప్రేమను, సమానత్వాన్ని పెంపొందిస్తాయి. కులవివక్ష లేని, ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణానికి బౌద్ధ ధర్మమే సరైన మార్గం. గ్రామంలోని యువకులు, ప్రతి ఒక్కరూ ఈ ధర్మ మార్గంలో నడవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బంసోడే గౌతం, బేర్జె విఠల్, వాగ్ మారే సంబాజి, డగే శంకర్, బంసోడే గౌతం, బంసోడె బాబు, అమ్రేరావు పుండలిక్, గదేవార్ అశోక్, బంసోడే భీం రావు, అమృత్, బంసోడే కైలాస్, డబ్ల్యూ శేషారావు, డబ్ల్యూ. అనిల్ బౌద్ధ ఉపాసకులు, మహిళలు, యువతి యువకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బుద్ధ వందనాలు పఠించి, శాంతి సందేశాన్ని చాటారు.


