భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, గోనెపల్లి గ్రామ బూత్ అధ్యక్షుడు మామిడి ఎల్లా గౌడ్ మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మండలం గోనెపల్లి గ్రామంలో ఎల్లా గౌడ్ మృతి విషయం తెలుసుకున్న ఆయన గ్రామానికి చేరుకుని నివాళులర్పించారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, గోనెపల్లి గ్రామ బూత్ అధ్యక్షుడు మామిడి ఎల్లా గౌడ్ మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మండలం గోనెపల్లి గ్రామంలో ఎల్లా గౌడ్ మృతి విషయం తెలుసుకున్న బైరీ శంకర్ ముదిరాజ్ గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను కప్పి ఘనంగా అంజలి ఘటించారు. ఎల్లా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్ నాయకుడు, బూత్ అధ్యక్షుడిని కోల్పోవడం బాధాకరమని నాయకులు పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల నాగరాజు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాతంగి నాగరాజు, మడిపల్లి బాపయ్య, జిల్లా నాయకుడు మెరుగు భూమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బస్వారాజ్ మహేష్, శివరాత్రి కనకయ్య, పరశురాములు, సందీప్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.












