జగిత్యాల పట్టణంలోని లోకపోచమ్మ తల్లి ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 48వ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేశ్ మాట్లాడుతూ లోకపోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో భవానీ భక్త బృందం సభ్యులతో పాటు మాజీ కౌన్సిలర్ ములస్తం లలిత మునిధర్, గాజుల రాజేందర్, కోఆప్షన్ సభ్యురాలు వీరబత్తిని పద్మజ, శ్రీనివాస్, నాయకులు వోళ్లెం మల్లేశం, రమేష్‌రావు, గాజుల శ్రీనివాస్, గంగారెడ్డి, గాంధీచారి, సాయికృష్ణ, తాడేపు మహేష్, కావేటి నవీన్, శీలం వంశీ, నవీన్, శరత్, భవానీ భక్త బృందం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.











