మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నల్గొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ ఆదేశాల మేరకు రైల్వే ఏఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షక దళం 24 గంటలు సేవలందిస్తున్నామని తెలిపారు. రైల్వే ఆస్తుల పరిరక్షణతో పాటు రైల్వే ప్రయాణికుల రక్షణ కోసం పాటుపడుతున్నామన్నారు.
రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పచ్చదనం పెంపొందించేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే కానిస్టేబుళ్లు ఎన్కె మీనా, ఆర్ జ్యోతి, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.


