మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలోని మద్నాపూర్ గ్రామంలో గల గంగేశ్వర్ మహారాజ్ ఆశ్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తన స్వంత నిధులతో 35 లక్షల రూపాయల వ్యయంతో గోశాలను నిర్మించారు. ఈరోజు ఉదయం గోశాలను ప్రారంభించి, గంగేశ్వర్ మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు.
అనూసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గోశాల నిర్మాణం జరిగిందని తెలిపారు. గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ గోవులను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మహారాజులతో పాటు మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, నాయకులు చక్రధర్ పటేల్, వెంగల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.








