ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదనే సంకల్పంతో వేములవాడలోని మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు నిరుపేదలకు అన్నదాన సేవలను కొనసాగిస్తోంది. దాతల సహకారంతో వరుసగా 2,019 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు కృషి చేస్తోంది. ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక టీటీడీ ధర్మశాల సమీపంలోని రాజన్న భీమన్న ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదానం నిర్వహించారు.
జ్ఞాపకార్థం అన్నదానం.. శాశ్వత సభ్యుల సహకారం
నాటి అన్నదాతలుగా ఇట్టేడు జగదీశ్వరయ్య, శారదాబాయి దంపతుల జ్ఞాపకార్థం వారి వీధి కూతురు, అల్లుడు హైదరాబాద్కు చెందిన డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ రామకృష్ణ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు, స్నేహాలత, ప్రతాప, స్వప్న, సంపత్, నగుబోతు రవీందర్, జ్యోతి, గణాచారి మఠం శైలజ, సాంబశివు, దేవరాజు, ఉమ, బాలచందర్, రాజు దంపతులు, రామడుగు శ్రీలత, వారి కుమారులు, కోడళ్లు ప్రజ్ఞ, శరత్చంద్ర, శిరీష, సాయిచంద్ర, శర్వాణి, రవిచంద్ర, హైదరాబాద్కు చెందిన చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ తదితరులు సేవలకు తోడ్పాటునందిస్తున్నారు.
శుభకార్యాల సందర్భంగా అన్నదానానికి ముందుకు రావాలి
పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆయువు, బలం, తేజస్సు, కీర్తి పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయని ట్రస్టు నిర్వాహకులు పేర్కొన్నారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, ఇతర శుభకార్యాల సందర్భంగా వేములవాడ ఆలయ పరిసరాల్లో ఒకరోజు అన్నదానం చేయాలనుకునే దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్నదానం చేయాలనుకునే వారు ట్రస్టు సభ్యులను లేదా 9246939388 నంబరును సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, వొద్యాల వేణు, పొలాస రాజేందర్, పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


