నిర్మల్, 19 October
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల 22న నిర్వహించనున్న పండుగ సాయన్న 174వ జయంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ముదిరాజ్ సమన్వయ సంఘాల కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి పోస్టర్ను విడుదల చేశారు.
(ప్రజా ప్రతినిధి): ఈ నెల 22న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న పండుగ సాయన్న 174వ జయంతిని విజయవంతం చేయాలని ముదిరాజ్ సమన్వయ సంఘాల కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్, మహాసభ రాష్ట్ర నాయకులు దర్శనం దేవేందర్ ముదిరాజ్, యువ నాయకులు పాతర్ల హరీష్ ముదిరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షులు బర్మ చిన్నయ్య ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ, ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బహుజన హక్కుల కోసం పోరాడిన అమరజీవి పండుగ సాయన్న ముదిరాజ్ స్ఫూర్తితో, ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీఏలోకి మారుస్తానని, పీసీసీ హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీఓ నంబర్ 15ను యధావిధిగా అమలు చేయాలని కోరారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా అన్ని ముదిరాజ్ సంఘాలను సమన్వయం చేసి, ముఖ్యమంత్రిని ఒప్పించడంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముదిరాజ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం ముదిరాజ్, మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ నీలం మధు ముదిరాజ్, యాదగిరి, ఉప్పరి నారాయణ ముదిరాజ్, బలరాం, యువ నేతలు అల్లుడు జగన్, నిజ్జన రమేష్ ముదిరాజ్, భీమ లక్ష్మణ్ ముదిరాజ్, రావుల రాజ శేఖర్ ముదిరాజ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అధికారికంగా నిర్వహించడానికి ఒప్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సాయన్న స్ఫూర్తితో ముదిరాజ్ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు సోలాపూర్ రాజేశ్వర్, బోండ్ల రమేష్ ముదిరాజ్, నిలాయిపేట్ సర్పంచ్ భీమేష్, పీచర మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బొర్రన్న ముదిరాజ్, న్యాయవాది గంగాధర్, నర్సయ్య, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.











