నిర్మల్ జిల్లా మండలం పాంగ్రీ గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో దుర్గామాత కొలువుదీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ ఏట కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపంలో భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అమ్మవారి విగ్రహం కోసం నాగుల గంగాప్రసాద్ విరాళం అందజేయడం విశేషం.
ప్రతి సంవత్సరం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర రోజున భక్తులకు అన్నదానం నిర్వహించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సల్లోల బుచ్చన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.










