సారంగాపూర్, 13 November
సారంగాపూర్ మండలం, యాకర్ పల్లి గ్రామం వద్ద స్వర్ణ నదిపై తక్కువ ఎత్తు కాజ్వే నిర్మించాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. రైతులకు, అడెల్లి పోచమ్మ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం ఈ కాజ్వే అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
సారంగాపూర్ మండలం, యాకర్ పల్లి గ్రామం వద్ద స్వర్ణ నదిపై తక్కువ ఎత్తు కాజ్వే నిర్మించాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు గారు రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. యాకర్ పల్లి రైతులకు నదికి ఇరువైపులా పొలాలు ఉన్నాయని, జూలై నుండి అక్టోబర్ వరకు వానాకాలం పంటలకు కీలక సమయంలో నదిలో నీరు ఉండటంతో కుడి ఒడ్డున ఉన్న పొలాలకు వెళ్ళలేకపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం మలక్ చించోలి గ్రామం మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చి రైతులకు ఇబ్బంది, ఆర్థిక భారం అవుతోందన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది అక్టోబర్ లో జరిగే ప్రముఖ అడెల్లి పోచమ్మ గంగ నీళ్ళ జాతర కు , దిలావర్ పూర్ మండలాల నుండి భక్తులు యాకర్ పల్లి వద్ద స్వర్ణ నది దాటి అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్తారని, భక్తులను సురక్షితంగా దాటించడం పోలీసు, రెవెన్యూ అధికారులకు కష్టంగా మారుతోందని వివరించారు. కాజ్వే నిర్మిస్తే రైతులకు, భక్తులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని కోరారు.
వినతి పత్రాన్ని సావధానంగా విన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రావు గారితో పాటు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ ఉమ మహేష్ రావు, వడ్లకొండ నవీన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.






