మహారాష్ట్రలోని బుల్డానా జిల్లా సిర్పూర్ గ్రామంలో ఆధ్యాత్మిక గురువు శేషారావు మహారాజ్ వర్ధంతి సందర్భంగా నేడు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు నిర్మల్ జిల్లా మండలం ఝరి-బి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు.
శేషారావు మహారాజ్‌ను ఆధ్యాత్మిక గురువుగా భావించే భక్తులు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా సిర్పూర్ గ్రామానికి చేరుకుని ప్రత్యేక పూజలు, భజనలు, ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఝరి-బి గ్రామం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి, కళ్ల విముక్తి కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
శేషారావు మహారాజ్ చూపిన ఆధ్యాత్మిక మార్గం, భక్తి, సేవా భావాలను స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. వర్ధంతి సందర్భంగా సిర్పూర్ గ్రామంలో భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.
ఝరి-బి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివెళ్లి మహారాజ్‌కు నివాళులు అర్పించనున్నారు. శేషారావు మహారాజ్ ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా భక్తులు ప్రార్థించారు.










