వృద్ధుల వారోత్సవాలను నిర్మల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రిటైర్డ్ పెన్షనర్స్ భవన్లో వృద్ధుల రక్షణ, సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత, వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు.
వృద్ధుల వారోత్సవాలను జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని రిటైర్డ్ పెన్షనర్స్ భవన్లో వృద్ధుల రక్షణ, సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత, వృద్ధులపై వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ లావాదేవీల సమయంలో వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. ఒకసారి వినియోగించే సంకేత సంఖ్య (), వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (), సంకేత పదాలు (), బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద లింక్‌లను తెరవడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, సామాజిక మాధ్యమాల్లోని ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. డిజిటల్ సేవలను సురక్షితంగా వినియోగించుకునే విధానాలను వివరించారు. వృద్ధులపై జరిగే శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను సకాలంలో గుర్తించి, నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. వృద్ధుల భద్రత, స్వేచ్ఛ, సంక్షేమం కోసం ప్రభుత్వ శాఖలు, న్యాయ సేవా సంస్థలు, పోలీసు వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సైబర్ విభాగం ఎస్ఐ శ్రావణి, రిటైర్డ్ పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షుడు కే. రమేష్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











