మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 20
జిల్లాలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు, శారీరక వ్యాయామం ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో 5కే, 10కే పరుగు కార్యక్రమం జరిగింది. ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లాలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు శారీరక వ్యాయామం ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో 5కే, 10కే పరుగును నిర్వహించారు. జిల్లా ఐబీ చౌరస్తా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎర్రబెల్లి రఘునాథ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, న్యాయవాదులు, పోలీసులు, ఆసుపత్రుల సిబ్బంది, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం నడక, వ్యాయామం, శారీరక శ్రమకు కేటాయించాలని నిర్వాహకులు సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కరే లచ్చన్న, న్యాయవాది కొట్టే నటేశ్వర్తో పాటు భాజపా సీనియర్ నాయకులు, యువ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేలా సాగింది.












