బైంసా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో ఆదివారం ఆరుష్ హాస్పిటల్ మరియు ఐక్యత సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ నరేష్ బందేల్వార్ 100 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు.
బైంసా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో ఆదివారం ఆరుష్ హాస్పిటల్ మరియు ఐక్యత సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ నరేష్ బందేల్వార్ 100 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ చింతపండు మహేష్ మాట్లాడుతూ, ఐక్యత సేవా సమితి, ఆరుష్ హాస్పిటల్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. వారి సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, వారికి శాలువా కప్పి సన్మానించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంక గంగాధర్, సుంకేట మహేష్, డాక్టర్ మోహన్, డాక్టర్ సాగర్, డాక్టర్ విజయ్, డాక్టర్ వినయ్ కపిల్ లతోపాటు స్థానిక నాయకులు, ఐక్యత సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












