హైదరాబాద్, 11 September
మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర సమన్వయకర్త నుతికడి భోజనారాయణ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి అందజేశారు. సంప్రదాయాన్ని కాపాడుతూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
విత్తన గణపతులను మాజీ స్పీకర్‌కు అందజేత ( మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర సమన్వయకర్త నుతికడి భోజనారాయణ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సంప్రదాయాన్ని కాపాడుతూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం, నిమజ్జనం స్థానంలో గణపతి విగ్రహాన్ని నేలలో నాటితే అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా మారుతాయని వివరించారు. “విత్తన గణపతిని పూజించి నేలలో నాటితే.. దేవుడే మొక్కగా మారి ఆశీర్వదిస్తాడు” అనే సందేశంతో పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.












