మిర్యాలగూడ, 10 September
పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషిలో భాగంగా, శ్రీ అగ్రోస్ ట్రాక్టర్ షోరూమ్ యాజమాన్యం గత 17 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను మట్టి వినాయక ప్రతిమలతో నిర్వహిస్తోంది. శబ్ద కాలుష్యం లేకుండా, భక్తి భావంతో వేడుకలు జరుపుకోవడం ఈ వేడుకల ప్రత్యేకత.
పర్యావరణ పరిరక్షణకు శ్రీ అగ్రోస్ ట్రాక్టర్ షోరూమ్ లో 17 ఏళ్లుగా మట్టి వినాయక ప్రతిమ తో వేడుకలు : మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషిగా శ్రీ విఘ్నేశ్వరుడి చవితి వేడుకలను మట్టి ప్రతిమలతో నిర్వహించాలనే సంకల్పంతో ప్రతి ఏటా విఘ్నేశ్వరుడి మట్టి ప్రతిమ ప్రతిష్ఠించి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ ఆగ్రోస్ ట్రాక్టర్ షో రూం యాజమాన్యం ఎన్. సత్యనారాయణరెడ్డి, సత్యం లు తెలిపారు. గత 17సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమను పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ప్రకృతిని ప్రేమిస్తూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా మట్టి వినాయకుడితో భక్తి బాటలో శ్రీ అగ్రోస్ మరో అడుగు ముందుకు వేస్తోందన్నారు.ఈ వేడుకల్లో ప్రత్యేకత ఏమిటంటే,డీ.జే,సౌండ్స్‌కు దూరంగా,శబ్ద కాలుష్యానికి చోటివ్వకుండా,భక్తి భావంతో, ప్రశాంతమైన వాతావరణంలో వినాయకుని ఊరేగింపు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.











