నల్లగొండ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కస్తూరి ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ గుడిపాటి కోటయ్య పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను ఆయన వివరించారు. మిర్యాలగూడలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరిగింది.
*పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను వాడుదాం* 👉*మట్టి గణపతే మహాగణపతి* 👉 కస్తూరి ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ గుడిపాటి కోటయ్య మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) వినాయక చవితిని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతోజరుపుకోవడమే కాకుండా మట్టి విగ్రహాలనుపూజించాలని తద్వారా వాటిని నిమజ్జనం చేయడం వల్ల ఆ మట్టి నీళ్లలో కరిగి పర్యావరణ పరిరక్షణ కు దోహధపడుతుందని కస్తూరి ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ గుడిపాటి కోటయ్య అన్నారు. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలు నాణ్యమైన జ్యూట్ బ్యాగు, వ్రత పుస్తకం ఉచితo గా పంపిణి చేయడంజరుగుతుందని, అందులో భాగంగా మిర్యాలగూడ లో సోమవారం పంపిణి చేశారు. మిర్యాలగూడ పట్టణ ప్రజలు మట్టి విగ్రహాలుప్రతిష్టించుకొని సుఖ సంతోషాలతో, భక్తి శ్రద్దలతో వినాయక ఉత్సవాలుజరుపుకోవాలని కోరారు. చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి ఇది మన సనాతన సాంప్రదాయానికి నిదర్శనం అని అన్నారు. ప్లాస్టర్ అఫ్ పారీస్ తో చేసిన వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల దాని తయారికి ఉపయోగించే జిప్సo,సల్పర్, పాస్పరస్, మెగ్నీషియం, కాడ్మియం, లెడ్, సీసం వంటి రసాయన పదార్ధాలు నిమజ్జనం చేసినపుడు నీటిలో కరగక నీటిని కలుషితం చేసి నీటిలో నివషించే జీవరాసులకు హాని కలిగించడం,పర్యావరణం దెబ్బతినడం జరుగుతుందని, మట్టి విగ్రహాలు వాడి నిమజ్జనం చేయడం వల్ల లాభాలు వుంటాయని, పర్యావరణ హితం కోసం కస్తూరి ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు అంబటి వీరనారాయణ, చిలుక నరేందర్ రెడ్డి, షేక్ ఉస్మాన్, యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు కట్టెబోయిన శ్రీనివాస్, గుడిపాటి వివేక్ యాదవ్, అంబటి శ్రీను, వడ్డేపల్లి వెంకటేష్, రాపోలు పరమేష్, కురువ తదితరులు పాల్గొన్నారు.












