బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 48వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్ల ఆటతీరుపై స్పందించారు. మొదట సరదాగా మాట్లాడుతూ ఇంటి సభ్యులను నవ్వించిన ఆయన, ఆ తర్వాత కొందరి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.
ముఖ్యంగా వర్షిణి, నీతూ మధ్య జరిగిన పరిణామాలపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. ప్రోమో ప్రారంభంలో నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరును ప్రస్తావించారు. నరేశ్ ఆటను చూసి ప్రేక్షకులు బాగా నవ్వుకుంటున్నారని ప్రశంసించారు. దేబ్జానీ ఆటతీరును కూడా మెచ్చుకున్నారు. దీంతో మొదట సరదాగా సాగిన వాతావరణం, తర్వాత నాగార్జున ప్రశ్నలతో ఒక్కసారిగా మారిపోయింది.
ముఖేశ్, వర్షిణిపై అసహనం
ముఖేశ్ మాట్లాడే విధానంపై నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. అనంతరం వర్షిణి ఆటతీరును ప్రస్తావిస్తూ, ప్రత్యర్థులను సవాలు చేయడం మాత్రమే సరిపోదని, ఆటలో పట్టుదల, పోరాట పటిమ కనిపించాలని సూచించారు. కేవలం మాటలతో కాకుండా ఆటలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని పరోక్షంగా హితవు పలికారు.
నీతూ విషయంలో వర్షిణికి కౌంటర్
నీతూను ఉద్దేశించి వర్షిణి గతంలో చేసిన వ్యాఖ్యలను నాగార్జున గుర్తుచేశారు. నీతూ.. నువ్వేం పీకుతావ్ అని అన్నావ్ కదా.. గేమ్ ఆడి ఏం పీకిందో చూపించింది కదా అంటూ వర్షిణిని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యతో వర్షిణి ఆటతీరుపై చర్చ మొదలైంది. ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేయడం కంటే, ఆటలో ప్రతిభను చూపించడమే ముఖ్యమని నాగార్జున చెప్పినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.
రాంప్రసాద్ సమాధానంతో మరింత ఆసక్తి
ఇదే సమయంలో వర్షిణి తిరిగి రావడం రాంప్రసాద్‌కు ఇష్టమేనా అని నాగార్జున ప్రశ్నించారు. అందుకు రాంప్రసాద్ లేదని సమాధానం ఇవ్వడంతో ఇంటి సభ్యుల మధ్య ఏం జరిగిందనే ఆసక్తి పెరిగింది. వర్షిణి, నీతూ మధ్య వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది నాగార్జున వ్యాఖ్యలపై వర్షిణి ఎలా స్పందిస్తుంది అనే విషయాలు పూర్తి ఎపిసోడ్లో చూడాల్సి ఉంది.
ప్రోమోతో బిగ్‌బాస్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కంటెస్టెంట్ల ఆటతీరుపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.






