వనపర్తి, 10 September
వైద్య విద్యలో ప్రవేశానికి అర్హత సాధించిన ఎడవల్లి శ్రావణిని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అభినందించారు. రాంనగర్ కాలనీలోని శ్రావణి నివాసానికి వెళ్లి ఆమెను సన్మానించారు.
వైద్య విద్యకు ఎంపికైన శ్రావణికి అభినందనలు , సెప్టెంబరు 10: వైద్య విద్యలో ప్రవేశానికి అర్హత సాధించిన ఎడవల్లి శ్రావణిని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అభినందించారు. రాంనగర్ కాలనీలోని శ్రావణి నివాసానికి వెళ్లిన కమిటీ సభ్యులు మాదారి భోజరాజు, ద్యారపోగు వెంకటేష్, చింతకుంట విశ్వం తదితరులు ఆమెను శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి వైద్యురాలిగా సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని అభినందనలు తెలిపారు. శ్రావణి వైద్య విద్యలో రాణించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.












