.శిక్షా రత్న అవార్డు గ్రహీతలు కిరణ్ కుమార్, నరేందర్ రెడ్డిల కు బిజెపి నాయకులు ఘన సన్మానం
మిర్యాలగూడ సెప్టెంబర్ 10 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణం లోని కె.ఎల్.ఎన్. జూని యర్ కళాశాలలు బాలి కల, బాలుర ప్రిన్సిపాల్ లకు ఇటీవల శిక్షా రత్న అవార్డుకు ఎంపిక చేసి రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్ లుగా సన్మానించిన విషయం తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్య సంస్థలలో అత్యుత్తమ సేవలు అందించి పేరుగాంచిన వారికి ప్రతిష్టాత్మక హరి యూనివర్సిటీ,సూపర్ ఏl ఫౌండేషన్, స్టడీ 9 మీడియా,సాక్షి ఎడ్యుకేషన్, సంయు క్తంగాఎంపీక చేసి ఉత్తమ ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అవార్డులను అందజేశారు. కళాశాల కరస్పాండెంట్, కె.ఎల్. ఎన్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. కిరణ్ కుమార్, మ్యాథమెటిక్స్ లెక్చరర్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తుమ్మలపల్లి నరేందర్ రెడ్డి లకు శిక్షా రత్నఅవార్డు పొందిన సందర్భంలో గురువారం
కేఎల్ఎన్ జూనియర్ కళాశాలలో కిరణ్ కుమార్, నరేందర్ రెడ్డిలకు బీజేపీ రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాస్ రావు, కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజు, మాలతీ,రేపాల పురుషోత్తం, చిలుకూరి శ్యామ్ ల ఆధ్వర్యంలో శాలువాలు పూలమా లతో ఘనంగా సన్మా నించారు.ఈ కార్యక్ర మంలోకళాశాల డైరెక్టర్లు పిఎల్ఎన్,రెడ్డి, టి హనుమంత రెడ్డి, చైతన్య, ఆనంద్, పి కామేష్, వై సునీల్ రెడ్డి, తో పాటు బిజెపి నాయకులుబండారు ప్రసాద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బంటు గిరి, పెద్దబోయినవెంకటేశ్వర్లు,చిల్లంచర్లఅభి,కొంగరి వెంకటర మణ, వేణు, పోరెడ్డి శ్రీను, భాషిపాక శంకర్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పృథ్విలు పాల్గొన్నారు.












