మర్కల్, కామారెడ్డి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకామారెడ్డిలో జువాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ కే. వనజ, ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో పాల్గొని గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. విద్యా, పరిశోధనా రంగాలలో ఆమె చేసిన కృషికి గాను ఈ గౌరవం లభించింది.
మర్కల్ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ బోధిస్తున్న డాక్టర్ కే. వనజకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టా ప్రధానం కామారెడ్డి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల–కామారెడ్డిలో జువాలజి విభాగాధిపతి అయిన డాక్టర్ కే. వనజ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో పాల్గొని, గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 85 వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్, ముఖ్య అతిథిగా భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా డాక్టర్ కే. వనజ గౌరవ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు.విద్యా మరియు పరిశోధనా రంగంలో డాక్టర్ కే. వనజ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల–కామారెడ్డి ప్రిన్సిపాల్ సి. శోభారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం డాక్టర్ కే. వనజను అభినందించి, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.











