బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
మండల విద్యాధికారి సుభాష్ సోమవారం మాంజరి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, విద్యా ప్రగతిని ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా తనిఖీ చేశారు.
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన విద్యాధికారి ( మండల విద్యాధికారి సుభాష్ మండలంలోని మాంజరి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యాలు, అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాగర్, ఉపాధ్యాయులు సునీత పాల్గొన్నారు.

