మండలం కమల్‌కోట్ గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు విద్యా వాలంటీర్లకు సెప్టెంబర్ నెల వేతనాలను శనివారం అందజేశారు.
గ్రామ సర్పంచ్ రావుల ముత్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు మన్మద్ రెడ్డి, ఉపాధ్యాయులు, వీఆర్సీ సభ్యుడు కొత్తూరు నాగరాజు చేతుల మీదుగా విద్యా వాలంటీర్లకు వేతనాలు అందజేశారు.
పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు విద్యా వాలంటీర్లు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వీఆర్సీ సభ్యులు పాల్గొన్నారు.











