పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మండలంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులందరూ నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పోలీస్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) షేక్ జూబేర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మండలంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులందరూ నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పోలీస్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) షేక్ జూబేర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థుల కోసం ఈ ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, నిర్మల్‌లోని డీఎస్పీ కార్యాలయం వెనుక, జై శంకర్ విగ్రహం వద్ద ఉన్న బ్రీఫింగ్ హాల్లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ శిక్షణలో సబ్జెక్ట్ నిపుణులచే జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్ అంశాలపై పూర్తి సిలబస్ ఆధారిత బోధనతో పాటు, క్రమం తప్పకుండా మాక్ టెస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ కోసం ప్రత్యేక ఫిట్నెస్ మార్గదర్శనం కూడా అందించబడుతుందని తెలిపారు. మీ లక్ష్యం మా మార్గదర్శనం అనే ధ్యేయంతో పోలీస్ శాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని మండల అభ్యర్థులు వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు.












