బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098పై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల విద్యాధికారి ఎం. గంగారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ స్వర్ణలత, ఐసీపీఎస్ కౌన్సిలర్ జమ్రత్ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, లైంగిక వేధింపులు, హింసకు గురవుతున్న పిల్లలకు రక్షణ, అక్రమ రవాణాకు గురవుతున్న బాలల సంరక్షణ వంటి అంశాలపై వివరించారు. పిల్లలకు ఏదైనా ఆపద లేదా సమస్య ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు మాధవి, స్రవంతి, ముజాహిబ్, పుష్ప, కవితతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సునీత, కవిత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
చైల్డ్ హెల్ప్‌లైన్ 1098పై అవగాహన సదస్సు బాల్యవివాహాలు,
Share:

సారాంశం
బాల కార్మిక వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన
ముఖ్య విషయాలు
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098పై అవగాహన సదస్సు నిర్వహించారు.
- గంగారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ స్వర్ణలత, ఐసీపీఎస్ కౌన్సిలర్ జమ్రత్ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
- బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, లైంగిక వేధింపులు, హింసకు గురవుతున్న పిల్లలకు రక్షణ, అక్రమ రవాణాకు గురవుతున్న బాలల సంరక్షణ వంటి అంశాలపై వివరించారు.
- బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4023ఆర్టికల్స్
4,86,849వ్యూస్










