హైదరాబాద్లో జరగనున్న సదర్ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి యాదవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ సదర్ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి యాదవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, వారసత్వ గొప్పతనానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల ప్రదర్శనలు, వాటి ఠీవి, దర్పం, సందడి సదర్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ఈ ఉత్సవాలు యాదవుల జీవన వైభవాన్ని చాటి చెబుతాయని ఆయన అన్నారు.
ప్రతి యాదవ కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపాలని, అందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని, యాదవుల ఐక్యత, అభ్యున్నతి మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

