కె.ఆర్.కె. కాలనీ, నిర్మల్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ కె.ఆర్.కె. కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద శ్రావణ సోమవారం సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
శ్రావణ సోమవారం సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్మల్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కె.ఆర్.కె. కాలనీలోని 7వ, 8వ వార్డుల పరిధిలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అన్నదాన, భజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శ్రావణ సోమవారం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రాము, 8వ వార్డు కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి శశికాంత్, దేవాంత రమేష్, రవి, ముసలే ఈశ్వర్, ఎల్చాల పోచన్నతో పాటు ఆలయ కమిటీ సభ్యులు బోడకుంట రాజు, సుభాష్, లాకీ నవీన్, సార్ల బుజ్జన్న, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.


