తానూర్, 14 September
నిర్మల్ జిల్లా మండలంలోని భోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడు కొలువుదీరాడు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన కర్ర వినాయకుడికి తొలిరోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడికి పూజలు, హారతి నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
భోసిలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడు తొలిరోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ( నిర్మల్ జిల్లా మండలంలోని భోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడు కొలువుదీరాడు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన కర్ర వినాయకుడికి తొలిరోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడికి పూజలు, హారతి నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే శ్రీ వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.












