అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం () విశాఖపట్నం జిల్లా మండల కార్యదర్శి, గురుస్వామి గుడ్ల నరసింహారెడ్డి ఈరోజు నుండి ఇరుముడితో శబరిమలకు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా భగవంతుని దర్శించుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం () విశాఖపట్నం జిల్లా మండల కార్యదర్శి, గురుస్వామి గుడ్ల నరసింహారెడ్డి ఈరోజు నుండి ఇరుముడితో శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గుడ్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు నాలుగు సార్లు శబరిమలకు సైకిల్ యాత్ర చేశానని తెలిపారు. ఇరుముడితో ఆ మణికంఠుడిని సైకిల్ యాత్ర చేసి దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన అన్నారు. గతంలో సైకిల్ పై కాశీ యాత్ర కూడా చేశానని ఆయన తెలిపారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా భగవంతుని దర్శించుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.












