మండలంలోని డోడర్న తండా నంబర్1 గ్రామంలో శ్రీ జగదంబ సేవాలాల్ మహారాజ్ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జి.విఠల్ రెడ్డి, సేవాలాల్ మహారాజ్ విలువలను ఆచరించాలని సూచించారు.
డోడర్న తండా నంబర్1 గ్రామంలో శ్రీ జగదంబ సేవాలాల్ మహారాజ్ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జి.విఠల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సత్యం, సేవ, ఐక్యత, ధర్మం, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు.
దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హైమద్, భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, స్థానిక సర్పంచ్ వందన బాయి బిక్కులాల్ చవాన్, మాజీ జడ్పీటీసీ చవాన్ శంకర్, మాజీ సర్పంచ్ విజయ్, సుది రాజన్న, నిర్మల్ జిల్లా డీసీసీ కార్యదర్శి కదం దిగంబర్ పటేల్, మాజీ సర్పంచ్ రంగశివుని, బోడిగాం సాయినాథ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


