మండలంలోని ఝరి (బి) గ్రామంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు భద్రతా ఏర్పాట్లు చేసిన ఎస్ఐ షేక్ జుబేర్తో పాటు పోలీసు బృందానికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా భక్తులు, గణేశ్ మండలి సభ్యులకు అవసరమైన భద్రత కల్పిస్తూ పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన పోలీసు సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.











