ఆడెల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 05
శ్రీశ్రీశ్రీ ఆడెల్లి పోచమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులు, వేదపండితులు, ఉగాది పురస్కార గ్రహీత అయిన గురుమంచి చంద్రశేఖర శర్మ తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 11 రోజుల పాటు మాలధారణ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీశ్రీశ్రీ ఆడెల్లి పోచమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులు, వేదపండితులు, ఉగాది పురస్కార గ్రహీత అయిన గురుమంచి చంద్రశేఖర శర్మ తెలిపారు.
ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 11 రోజుల పాటు మాలధారణ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఐదు రోజుల దీక్షను ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన మాల విరమణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
భక్తులు పెద్ద సంఖ్యలో మాలధారణ స్వీకరించి, నియమ నిష్ఠలతో దీక్షను పూర్తి చేసి అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు పొందాలని గురుమంచి చంద్రశేఖర శర్మ కోరారు.












